రెచ్చిపోయిన అమ్మాయిలు.. చంపేశారు

ఫుట్ పాత్ పై చెప్పులు కుట్టుకుంటూ బ్రతుకుతోన్న వ్యక్తి పాలిట అమ్మాయిలు కాలయముళ్లయ్యారు. తప్పతాగి అర్థరాత్రివేళ కారు హైస్పీడ్ లో నడుపుతూ పుట్ పాత్ పై నిద్రిస్తోన్న వ్యక్తి పైకి ఎక్కించేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారులో నలుగురు అమ్మాయిలూ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు. కారులోని యువతులు మద్యం సేవించినట్టు సమాచారం. అరుపులు, కేకలతో ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడంవల్లే కారు అదుపుతప్పి ఫుట్ పాత్ ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫుట్ పాత్ పై ఉన్న తన దుకాణం దగ్గర నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తి మృతిచెందగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణం హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలాఉండగా, ఈ ఘటనపై కుషాయిగూడ సీఐ చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. వాహనాన్ని నడిపిన యువతి ఈశాన్యరెడ్డి మద్యం తాగలేదని చెప్పారు. ఆమె కారును అజాగ్రత్తగా నడపటం వల్లే… ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం సమయంలో కారులో ఉన్న నలుగురు యువతుల్లో, మలక్‌పేట సీఐ గంగారెడ్డి కూతురు హారికారెడ్డి ఉన్నారని చెప్పారు. నలుగురిలో ఒక యువతి మాత్రమే మద్యం తాగి ఉన్నారని సీఐ పేర్కొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఏఎస్ రావు నగర్ నుంచి తార్నాక వైపుకు స్కోడా కారులో పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు చెప్పారు. డ్రైవింగ్ చేసిన యవతిపై 304 (ఎ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

READ ALSO

Related News