‘పవన్ కళ్యాణ్ కంటే కత్తి మహేష్ అందగాడు!’

వర్మ మళ్ళీ ప్లేటు తిరగేశాడు. మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తి.. అతడే తనకు స్ఫూర్తి అంటూ తెగ పొగిడిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు పవర్ స్టార్ కి ‘పవర్’ పోయిందంటూ గాలి తీసేశారు. అజ్ఞాతవాసి మూవీ మీద పడిపోతున్న క్రిటిక్స్ తాకిడిలో నేను సైతం అంటూ వర్మ కూడా ఒక చెయ్యేశాడు. పనిలో పనిగా కత్తి మహేష్ కి బాసటగా నిలిచాడు.

వ‌ర్మ వదిలిన లేటెస్ట్ ట్వీట్స్‌ ద్వారా అతడిలోని కవి మళ్ళీ బైటికొచ్చేశాడు. పవన్ హీరోగా వచ్చిన ‘అజ్ఞాత‌వాసి’పై వర్మ స్పందించిన తీరు.. మరింత విశిష్టంగా వుంది. ”కోరలు, పంజాలేని పులిని ఇప్పటివరకు నేను చూడలేదు, ఈసారి ఈ పులి చారలు కూడా మార్చెయ్యడం ఆశ్చర్యం కలిగించింది” అంటూ పవర్ స్టార్ పెర్ఫామెన్స్ ని క్రిటిసైజ్ చేశాడు వర్మ. ఎగిరి మీదకు దూకాల్సిన పులి.. పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్న వర్మ ట్వీట్‌ని సీరియస్ ‘అజ్ఞాతవాసి’ టాక్ ని మరింత సీరియస్ గా మార్చేసింది. ఇదిలా ఉంటే.. కత్తి మ‌హేష్‌ రివ్యూ వీడియో మీద వర్మ రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు పవన్‌ కంటే కత్తి చాలా అందంగా కనిపించాడన్నది వర్మ కాంప్లిమెంట్. ఇది చాలదా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ‘కాలడానికి’!

Related News