ఇదీ.. ‘ఆఫీసర్’ లోగుట్టు

డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన ‘ఆఫీసర్’ మూవీ గురించి ఓ కొత్త విషయాన్ని రివీల్ చేశాడు. ఇది సినిమా స్టోరీ కాదని, ఓ ఐపీఎస్ అధికారి రియల్ స్టోరీతో రెడీ చేసిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. నాగార్జునతో తాను చేసిన ‘ఆఫీసర్’ సినిమా కర్ణాటకకు చెందిన ప్రసన్న అనే ఐపీఎస్‌ అధికారి స్టోరీ అని వెల్లడించాడు.

ముంబైలోని ఓ పోలీస్ ఉన్నతాధికారి కేసును విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌కు ఆయన చీఫ్‌గా నియమించారు. 2010లో ప్రసన్న తనతో వ్యక్తిగతంగా కొన్నివిషయాలు షేర్ చేశారని, ఆయా విషయాలతోనే ‘ఆఫీసర్’ స్టోరీ తయారైందని రాసుకొచ్చాడు.

సినిమాలో నాగార్జున.. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ మిస్టర్ ప్రసన్న రోల్ చేస్తున్నాడు. ఇక రిలీజ్‌కి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ‘ఆఫీసర్’ జూన్‌ ఒకటిన రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వర్మ. తన స్ర్కిఫ్ట్స్‌తో సినిమా చేసి తనకు క్రెడిట్ ఇవ్వడంలేదంటూ జయకుమార్ అనే రైటర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వర్మ ఇలా రియాక్ట్ అయ్యాడు.

 

READ ALSO

Related News