నాకెందుకూ చెక్ ? పేద రైతుకివ్వండి

రైతుబంధు పథకం కింద తనకు అందిన చెక్కును ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తిరిగి ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని ఎవరైనా పేద రైతుకు ఇవ్వాలని కోరారు. రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తెలంగాణలో ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని కింద రైతులకు ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో నాలుగేసి వేలను అందిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో తనకు ఉన్న కొంతభూమికి గాను హరీష్ శంకర్ కు కూడా ఈ పథకం కింద చెక్కు అందింది. అయితే..దీన్ని పేద రైతుకెవరికైనా ఇవ్వాలంటూ.. ఆయన.. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య  సమక్షంలో తమ గ్రామ సర్పంచ్ కు తిరిగి ఇచ్చేశారు. రైతుబంధు పథకం బాగుందని కితాబిచ్చిన హరీష్.. తనకు అందిన సొమ్ముకు మరికొంత మొత్తం కలిపి సర్పంచ్ కు అందజేసినట్టు చెప్పారు.

READ ALSO

Related News