ధర్మపురి సంజయ్‌ అరెస్ట్

శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్‌ని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మూడుగంటలపాటు విచారించిన ఖాకీలు.. అరెస్ట్ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో న్యాయమూర్తి సంజయ్‌కి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఆయనను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.

ఇన్నాళ్ళుగా అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్ కోసం నాలుగు పోలీసు ప్రత్యెక బృందాలు గాలిస్తూ వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన ఆదివారం పోలీసులకు లొంగిపోయాడు. అతడ్ని నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ నేతృత్వంలోని బృందం విచారించింది.

READ ALSO

Related News