హీరో నితిన్‌పై కేసు కొట్టివేత

సినీ నటుడు నితిన్‌తో బాటు ఆతని సోదరి నిఖితారెడ్డిపై హైదరాబాద్ మల్కాజ్‌‌గిరి కోర్టులో దాఖలైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ” అఖిల్ ” మూవీకి సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ. 50 లక్షలు తీసుకుని ఇవ్వకుండా తనను మోసగించారని జి.సత్యనారాయణ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేశారు.

ఇందులో నితిన్ తో బాటు అతని సోదరి నిఖితా రెడ్డి, తండ్రి సుధాకర రెడ్డి, శ్రేష్ఠ మూవీస్ ను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన 20 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వీరికి నోటీసులు జారీ చేయగా..ఈ కేసును కొట్టివేయాలంటూ నితిన్ హైకోర్టుకెక్కాడు. ఇది చెక్కులకు సంబంధించిన సివిల్ వివాదమని, క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని నితిన్ తరఫు న్యాయవాది వాదించారు. చివరకు కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

Related News