AP / general news
దుర్ఘటనపై సీపీఐ నారాయణ ఏమన్నారు ?

కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ వీడియో బైట్ విడుదల చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ విషాదంలో తన బావమరది భార్య, కోడలు, మనవరాలు మృతి చెందారని ఆయన అన్నారు. ఈ ప్రమాదం జరగడానికి ప్రభుత్వ అజాగ్రత్తే కారణమని, అనుమతి లేకుండా బోట్లు ఎలా తిరుగుతాయని ప్రశ్నించారు. ఏపీ సీఎం సింగపూర్, మలేషియా అని తిరుగుతూ టూరిజం ను అభివృద్ది చేస్తున్నామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని, ఇక నైనా ప్రభుత్వ పెద్దలు భ్రమల నుంచి బయట పడాలని ఆయన కోరారు.  ఈ ఘటనలో మరణించినవారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Read Also

 
Related News