India / Politics
మధ్యప్రదేశ్ లో మరో వికెట్ డౌన్! మోదీ హవాకు చెక్!

మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంద్ చతుర్వేది సమీప బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్ త్రిపాఠీ పై 14 వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి గెలుపొందారు. చతుర్వేదికి 66,810 ఓట్లు రాగా, త్రిపాఠీకి 52,677 ఓట్లు లభించాయి. ప్రభుత్వ అవినీతిని ఇక్కడి కాంగ్రెస్ నేతలు బాగా ఎండగట్టగలిగారు. ఇటీవల పంజాబ్ గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ఉత్తరాదిన క్రమంగా ప్రధాని మోదీ హవా తగ్గుతోందా అని రాజకీయ విశ్లేషకులు తర్కించు కుంటున్నారు. ఇక గుజరాత్ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపొందినా కాంగ్రెస్ తన ఓట్ల శాతాన్ని పెంచు కోవచ్చునని అంచనా వేస్తున్నారు.

 

Read Also

 
Related News