చీఫ్‌జస్టిస్ అభిశంసనకు ‘నో’

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన.తన విజిట్ ను అర్ధంతరంగా రద్దు చేసుకుని ఆదివారం మధ్యాహ్నం హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు.

దీపక్ మిశ్రా అభిశంసనపై ఆయన ఇదివరకే అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ తో సహా.. రాజ్యసభ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ అధికారులతో చర్చించారు. తమ అభిశంసన తీర్మానాన్ని చేపట్టకపోతే సుప్రీంకోర్టుకెక్కుతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించినట్టు సమాచారం. ఏడు పార్టీలకు చెందిన71 మంది ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన నోటీసును వీరు ఈ నెల 20 నే వెంకయ్యనాయుడుకు సమర్పించారు.

Related News