గవర్నర్ నిర్ణయంపై భగ్గుమన్న కాంగ్రెస్, కౌంటరిచ్చిన బీజేపీ

ప్రభుత్వం ఏర్పాటుకు యడ్యూరప్పని గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించడంపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. పూర్తి మెజార్టీవున్న కాంగ్రెస్- జేడీఎస్‌ని కాదని, బీజేపీకి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం. యడ్యూరప్పని ఆహ్వానించినట్టు తమకు తెలిసిందని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజ్యాంగబద్ధంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించాలని మరో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు.

అసలు రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో తమకు అర్థంకావడంలేదని, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ విషయంలో కాంగ్రెస్ తమకేమీ చెప్పాలని అవసరం లేదన్నారు.

Related News