కర్ణాటక గవర్నర్ మరో వివాదం!

కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌ వాలా మరో కొత్త వివాదానికి తెర లేపారా? అవుననే అంటున్నారు రాజకీయ నేతలు. కొత్త సీఎం యడ్యూరప్ప బల నిరూపణ వ్యవహారం ఇంకా పూర్తి కాకముందే ఓ ఆంగ్లోఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్‌ చేశారు. గవర్నర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆ‍శ్రయించాయి. వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ని అసెంబ్లీకి గవర్నర్‌ నామినేట్‌ చేశారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అందులో ప్రస్తావించారు. బల పరీక్ష పూర్తయ్యేవరకు అది చెల్లకుండా ఆదేశాలివ్వాలని కోరాయి. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.

మొత్తం 222 స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. మరో రెండు సీట్లకు ఎన్నిక వాయిదాపడింది. ఇప్పుడు కొత్తగా నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌తో కలిపి కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి చేరింది. ఇప్పటికే జేడీఎస్‌-కాంగ్రెస్‌లకు 117 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ.. 104 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించారు గవర్నర్. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండగా, ఇప్పుడు ఈ సమస్య వచ్చిపడింది.

READ ALSO

Related News