హైదరాబాద్‌లో ఆజాద్, సిద్ధూ.. తాజ్ కృష్ణలోనే కర్ణాటక సీఎల్పీ భేటీ

కన్నడ పొలిటికల్ ప్లాట్ ఫామ్ భాగ్యనగరానికి చేరింది. ఏఐసీసీ ప్రతినిధి గులాం నబీ ఆజాద్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య  హైదరాబాద్ చేరుకున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి.. అక్కడే సీఎల్పీ భేటీ నిర్వహించారు. రేపటి బలపరీక్ష నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై లోతుగా చర్చించి.. ఇక్కడినుంచి బయలుదేరి రాత్రిలోగా బెంగళూరు చేరుకుంటారని తెలుస్తోంది.

అంతకుముందు.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప అధికారులను మార్చడం వంటి నిర్ణయాలు వేగంగా తీసుకోవడంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చేశారు కాంగ్రస్- జేడీఎస్ ఎమ్మెల్యేలు. శుక్రవారం ఉదయం మూడు బస్సుల్లో వచ్చిన ఎమ్మెల్యేలు వేర్వేరు హోటల్స్‌లో బస చేశారు. తాజ్‌కృష్ణలో కాంగ్రెస్, నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు దిగారు. దీంతో ఆయా హోటల్స్ వద్ద సందడి నెలకొంది. మరోవైపు తాజ్ కృష్ణలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి… కన్నడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు.

READ ALSO

Related News