అమరావతి భూవివాదం.. మంత్రి దేవినేనిపై ఫిర్యాదు

తెలంగాణ, ఏపీల మధ్య ఇది మరో లొల్లి! మంత్రి దేవినేని ఉమ భూవివాదంలో చిక్కుకున్నారు. రాజధాని అమరావతి వద్ద భూమి అమ్మాల్సిందిగా బెదిరిస్తున్నారంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై హైదరాబాద్‌లో ఫిర్యాదు నమోదైంది. ఏపీకి చెందిన సురేష్ – ప్రవిజ దంపతులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కంప్లయింట్ చేశారు. మంత్రి దేవినేని ఉమతో పాటు, ఆయన సోదరుడు, అనుచరులు కూడా తమను బెదిరించారని, ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో వీళ్లకు పెళ్లి కానుకగా అమరావతి సమీపంలో కొంత భూమి వచ్చింది. రాజధాని ఖరారు కాకముందు.. చౌకగా వున్న ఈ భూమి.. తర్వాత బాగా పుంజుకుంది. ఎకరం కోటి దాటిపోయింది. ఈ క్రమంలో తమ భూమిపై చాలామంది నాయకులు కన్నేశారని, మంత్రి అనుచరుల పేరుతో తమకు బెదిరింపులు వచ్చేవని చెబుతున్నారు. నాని, రాజేందర్, మరో వ్యక్తి వీళ్ళలో ఉన్నట్లు సురేష్ దంపతులు జూబ్లీ హిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నేరుగా ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని పేరును ప్రస్తావించడంతో.. ఈ అంశం రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. మరి.. దేవినేని ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News