చిక్కిన అవినీతి పిశాచి

విజయవాడలో మరో అవినీతి పిశాచి ఏసీబీకి చిక్కింది. 27 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏడుకొండలు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ చరిత్రలోనే ఇంతపెద్దమొత్తంలో లంచంతీసుకుంటూ అవినీతి అధికారి దొరికిపోవడం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ లో చెక్‌పోస్ట్‌ల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న ఏడుకొండలు.. ఈడుపుగల్లు కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసులో లంచం తీసుకుంటూ పట్టుబడిపోయారు. ఓ కంపెనీకి ఇన్‌పుట్‌ పన్ను రాయితీ చెల్లించేందుకు గాను రూ.27 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కాడు ఏడుకొండలు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో రూ.27 లక్షలు చేతులు మారుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో నిన్నటి నుంచి నిఘా పెంచామని ఏసీబీ అధికారి ఠాకూర్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ లేని సమయంలో కంపెనీ ప్రతినిధులను పిలిచారని ఠాకూర్ వివరించారు.

 

Related News