స్వాతి పెళ్లి 30న, ఆ తర్వాత

హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి ఓ శుభవార్త. ఆమె త్వరలో మ్యారేజ్ చేసుకోనుంది. మలేషియన్ ఎయిర్‌ లైన్స్‌ లో పనిచేస్తున్న పైలట్ వికాస్‌ను పెళ్లి చేసుకోనుంది. స్వాతి-వికాస్ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. వీళ్ల లవ్‌కి ఇరు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం అనంతరం కొచ్చిన్‌లో రిసెప్షన్ వుండనుంది. ప్రస్తుతం వికాస్.. ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఉంటున్నాడు. పెళ్లి తర్వాత స్వాతి తన భర్తతో అక్కడే సెటిల్ కానుంది. ఈ లెక్కన గ్లామర్ ఇండస్ట్రీకి ఈ బ్యూటీ దూరమైనట్టేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్‌తో యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించింది స్వాతి. ఆ తర్వాత వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, హీరోయిన్‌.. ఇలా అంచెలంచెలుగా ఎదిగింది. స్వామిరారా, అష్టాచెమ్మా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న స్వాతి, ఆ తర్వాత మిగతా భాషల సినిమాల్లో నటించింది. కొన్నాళ్ల కిందట ఓ వెబ్‌ ఛానెల్ ఇంటర్య్వూలో తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది. దీంతో మరో ఏడాదిలో స్వాతి మ్యారేజ్ అయిపోవడం ఖాయమని అప్పట్లోనే వార్తలొచ్చాయి.

READ ALSO

Related News