చిరు అల్లుడు కల్యాణ్ మూవీ అప్‌డేట్స్

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ ఫస్ట్ మూవీ గురించి కొత్త న్యూస్. ఈ ప్రాజెక్ట్ డబ్బింగ్ కార్యక్రమాలు గురువారం నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యాయి. కల్యాణ్‌ తన రోల్‌కి తానే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు. స్టోరీకి తగ్గట్టుగా టైటిల్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది యూనిట్. బాహుబలిలాంటి చిత్రానికి పనిచేసిన సెంథిల్‌ దీనికి కెమెరామన్‌. రంగస్థలంతో గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ.. ఈ ప్రాజెక్ట్ కి పనిచేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్‌ హీరోయిన్. ‘జతకలిసే’ ఫేమ్‌ రాకేష్‌ శశి డైరెక్షన్‌లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలోవుంది.

READ ALSO

Related News