కేరళకు విరాళాలు ప్రకటించిన చిరుఫ్యామిలీ

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తాము సైతం అంటూ ముందుకొచ్చింది చిరు ఫ్యామిలీ. కేరళ వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి సహా ఆయన కుటుంబసభ్యులు విరాళాలు ప్రకటించారు. చిరంజీవి రూ.25 లక్షలు, ఆయన తల్లి అంజనాదేవీ లక్ష రూపాయలు, చిరు తనయుడు రామ్ చరణ్ రూ.25 లక్షలను ఆన్ లైన్ ద్వారా కేరళ సీఎం సహాయనిధికి పంపారు. ఇక, రామ్ చరణ్ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువ చేసే మందులు, ఆహారపదార్థాలు కేరళకు పంపించారు. ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు కేరళ వరద బాధితులకు సమాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా, కేరళ వర్ష, వరద బాధితులకు టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ఓ ప్రకటన చేశారు. మన భూతల స్వర్గం ఎనభై శాతం మునిగిపోయిందని, ఈ దృశ్యాలను టీవీలో చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నట్టు శివాజీ కోరారు.

Related News