వాజ్‌పేయి మరణంపై చైనా మీడియా..

ఇండియాకి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయిని గుర్తించడంలో విఫలమైంది చైనా మీడియా. అక్కడి న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఘోర తప్పిదం చేసింది. వాజ్‌పేయి మృతి విషయాన్ని ట్వీట్ చేస్తూ ఆయనకు బదులుగా జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు సీరియస్ అయ్యారు.

చీప్ జర్నలిజానికి ఇదే నిదర్శనమని, భారత్‌ అంటే చైనీయులకు ఎందుకంత అలుసని మరికొందరు కామెంట్స్ చేశారు. పరిస్థితి గమనించిన జిన్హువా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఫొటోను సరిదిద్దిన తర్వాత కూడా కామెంట్ల వర్షం కురిసింది. అప్పట్లో వాజ్‌పేయి కేబినెట్‌లో ఫెర్నాండెజ్ రక్షణమంత్రిగా పనిచేసిన విషయం తెల్సిందే!

Related News