India / Crime
ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ..లవ్ జిహాద్‌కి ప్రతీకారం ?

రాజస్తాన్ లోని రాజసమంద్ లో జరిగిందో దారుణం. అక్కడ ఓ వ్యక్తిపై  ఒకడు అతి కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి సజీవ దహనం చేశాడు. పైగా తన అమానుష కాండను  వాట్సాప్ ద్వారా చిత్రీకరించి..రెండు  క్లిప్పింగులను  సర్క్యులేట్ చేశాడు. లవ్ జిహాద్ కు పాల్పడిన వారందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. ఈ వ్యక్తిని శంభూ లాల్ గా గుర్తించగా ..హతుడిని అఫ్రాజుల్ గా పేర్కొంటున్నారు. శంభు లాల్ ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా.. రాజసమంద్ లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. శంభు లాల్.. అఫ్రా జుల్ అనే వ్యక్తికి కూలీ పని ఇస్తానని నమ్మించి ఈ దారుణానికి తెగబడ్డాడు. లవ్ జిహాద్ నుంచి ఓ  మహిళను కాపాడడానికే తానీ హత్యకు పాల్పడ్డానని అంటున్నాడు. అయోధ్య సమస్య మళ్ళీ తెరపైకి రావడంతో.. హిందూ అతివాదులు లవ్ జిహాద్ ను అణచివేసేందుకు పెను దాడులకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. 

 

Read Also

 
Related News