అటల్‌జీకి అతిపెద్ద బహుమతులు

భారతదేశ మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు చిరకాలం గుర్తుండి పోయేలా చేస్తోంది ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం. తమ రాజధాని నయా రాయ్‌పూర్‌ పేరును అటల్ నగర్‌గా మార్చాలని నిర్ణయించింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటులో వాజ్‌పేయి చేసిన మేలును తామెప్పటికీ మర్చిపోలేమని, అందుకే రాజధాని పేరును అటల్ నగర్‌గా మార్చి స్మరించుకోవాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తెలిపారు. అంతేకాదు, బిలాస్‌పూర్ యూనివర్సిటీ, నయారాయ్‌పూర్‌లోని జాతీయ పార్కు, రాజ్‌నందగావ్ వైద్యశాలకు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు బెటాలియన్ పేరును ఫోఖ్రాన్ బెటాలియన్‌గా మార్చనున్నట్టు వెల్లడించారు.

వాజ్‌పేయి స్మరణలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ముందుకొస్తున్నాయి. స్మారకాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేష్‌లోని ఆడిటోరియానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, మహారాష్ట్రలోని స్టడీ సర్కిళ్లు కూడా అటల్ పేరుపై మారిపోనున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇలా వాజ్‌పేయి రుణాన్ని తీర్చుకునే పనిలో పడ్డాయి పలు రాష్ట్ర ప్రభుత్వాలు.

Related News