28లోగా బాబు ‘డ్రీమ్ టీమ్’.. ఇద్దరికే లక్కీ ఛాన్స్!

ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రక్షాళన బాట పట్టారు. ఈసారి మంత్రివర్గ రూపురేఖల్ని మార్చి.. ఎలక్షన్ క్యాబినెట్ రూపొందిస్తారని తెలుస్తోంది. బీజేపీ నిష్క్రమణతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలన్నది మొదటి లక్ష్యం. కానీ.. ఇదే గ్యాప్‌లో మరికొన్ని కొత్త తలకాయల్ని టీమ్‌లో చేర్చే అవకాశాల్ని బాబు పరిశీస్తున్నట్లు సమాచారం. కీలకమైన ఆరోగ్య శాఖ ఖాళీగా ఉండడం, మైనారిటీ మంత్రి ఒక్కరూ లేకపోవడం, కొంతమంది మంత్రుల పెర్ఫామెన్స్ సరిగా లేదన్న రిపోర్ట్స్ రావడం లాంటి అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు విస్తరణ చేపట్టే అవకాశం వుంది. వైసీపీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్‌ని గత జూలైలోనే వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా నియమించి బుజ్జగించేశారు. ఇక.. ఇద్దరు మైనార్టీ లెజిస్లేటర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఈనెల 28వ తేదీన జరిగే మైనార్టీ సదస్సులోగా కేబినెట్‌ విస్తరణ పూర్తి కావచ్చని తెలుస్తోంది.

Related News