ముగ్గులపోటీ పేరిట చైన్ స్నాచింగ్స్

హైదరాబాద్‌లో మళ్లీ చైన్ స్నాచర్లు పడగ విప్పారు. ముగ్గుల పోటీ పేరుతో వచ్చి చైన్ లు లాక్కెళ్తున్నారు కేడీగాళ్లు. కూకట్ పల్లి, మియాపూర్ లో నిన్న ఒక్కరోజే మూడు చోట్ల చైన్ స్నాచింగ్స్ జరిగాయి. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు సైతం జారీచేస్తుండటం ఆయా కాలనీల వాసుల్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఒంటరిగా ఉన్న మహిళనే టార్గెట్ చేసే చైన్ స్నాచర్లు పక్కన మగవాళ్లు ఉన్నప్పటికీ చాకచక్యంగా ఆడవాళ్ల మెడలోని గొలుసులు తెంపుకుపోతున్నారు. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలకు చిక్కాయి.

Related News