ప్రభుత్వ ఆఫీస్‌‌.. డ్యాన్స్‌లతో రచ్చచేసిన ఉద్యోగులు

ప్రభుత్వ ఆఫీస్ అంటే డ్యూటీకి వచ్చిన అధికారులు వాళ్ల పనుల్లో బిజీగా ఫైళ్లతో కుస్తీలు పడుతూ కనిపించడం తరచూ చూస్తుంటాం. కానీ, మధ్యప్రదేశ్‌‌లో దేవాస్‌లోని గవర్నమెంట్ అధికారుల రూటే సెపరేట్. విధులను కాసేపు పక్కన పెట్టేసి ఇలా దుకాణం పెట్టేశారు. ఆఫీస్‌ని క్లబ్‌గా మార్చేసి పసందైన పాటలకు డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు. ఆడవాళ్లు, మగవాళ్లనే తేడా లేకుండా చిందులేశారు.

ఈ సీన్ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది. ఓ అధికారి బర్త్ డే కావడంతోనే ఇలా డ్యాన్సులు వేసినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ ఆఫీస్‌లోని అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

 

Related News