సీఎంగా యడ్యూరప్ప.. కేబినెట్ లో బెర్త్ కోసం పైరవీలు

మొత్తానికి యడ్యూరప్ప నేతృత్వంలో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా ఈ ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక గవర్నర్ యడ్యూరప్ప చేత రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రముఖలు హాజరయ్యారు. దీంతో యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసినట్టు అయింది.

 

కాగా, రాజ్ భవన్ ఎదుట బీజేపీ నేతల సంబరాలు చేస్తుండగా, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ బీజేపీ తీరుని దుయ్యబెడుతున్నారు. మరోవైపు కేబినెట్ లో బెర్త్ కోసం గెలిచిన లీడర్స్.. సీనియర్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు.

Related News