స్మృతి ఇరానీకి మోదీ షాక్

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకు పీఎం మోదీ షాకిచ్చారా? అవుననే అంటున్నాయి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్. సమాచార ప్రసారశాఖ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. ఆమె స్థానంలో రాజ్ వర్థన్‌సింగ్ ఆ శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు. స్మృతి ఇరానీ కేవలం టెక్స్‌టైల్ మంత్రిగా కొనసాగనున్నారు. అరుణ్ జైట్లీకి అనారోగ్యం కారణంగా ఆర్థికశాఖకు పీయూష్ గోయల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా అహ్లువాలియాను నియమించారు. కొన్నిగంటల్లోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ మార్పు ఏంటంటూ అప్పుడే చర్చించుకోవడం మొదలైంది.

 

READ ALSO

Related News