బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా మృతి

పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా మరణించారు. 55 ఏళ్ళ ఆయన బుధవారం ఉదయం గుండెపోటుతో కన్ను మూశారు. తెలుగులో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి తదితర సినిమాల్లో నటించిన ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించాడు.

2002 లో ” ఫంటూష్ ” సినిమాతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన నరేంద్ర ఝా.. గదర్, మొహెంజోదారో, రాయీస్ లాంటి చిత్రాల్లో నటించాడు. సల్మాన్ ఖాన్ హీరోగా విడుదల కానున్న ” రేస్-3 ” ఆయన నటించిన చివరి చిత్రం. ఆయన మృతి పట్ల బాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

READ ALSO

Related News