నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తక్షణమే ప్రధానమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హీరో ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకానొక దశలో కార్యకర్తలు ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అప్పటికే మోహరించిన పోలీసులు.. బీజేపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్‌ చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఏపీ, తెలంగాణల్లో  కొన్నిచోట్ల టీడీపీ- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

READ ALSO

Related News