చంద్రబాబూ కాసుకో.. రామ్ మాధవ్ హెచ్చరిక!

కన్నడ ఎఫెక్ట్ ఏపీ పాలిటిక్స్ మీద పడుతుందా? అనే విశ్లేషణలు మొదలయ్యేలోగానే.. కమలనాధుల నుంచి గాండ్రింపులు షురూ అయ్యాయి. బీజేపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, తాజా ఏపీ అనఫీషియల్ ఇన్‌ఛార్జ్ రామ్‌మాధవ్ నేరుగా హెచ్చరికలే జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కుయుక్తులేవీ కర్ణాటకలో పని చేయలేదని, చంద్రబాబు పప్పులు తమదగ్గర ఉడకబోవని వార్నింగ్ ఇచ్చారు రామ్‌మాధవ్. కర్ణాటక ఫలితంపై స్పష్టత వచ్చీరాగానే ఆయన ఏపీ పాలిటిక్స్‌ని కెలకడానికేనన్నట్లు సూటిగా ఒక ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే ‘హైదరాబాద్ కర్ణాటక’లో బీజేపీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందంటూ ఫిగర్స్‌తో సహా చూపించారు. ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు లాంటి వాళ్ళను ఎగదోసి కర్ణాటకలో బీజేపీ ఓటమి కోసం శ్రమించిన చంద్రబాబును ఇక బీజేపీ టార్గెట్ చేయడం ఖాయమన్న ఇండికేషన్స్ రామ్ మాధవ్ ట్వీట్ లో కనిపించాయి. దక్షిణాదిలో కాలు మోపేశాం.. మీరూ సిద్ధంగా వుండండి అన్న రామ్‌మాధవ్ ‘హుంకరింపు’ను చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.

READ ALSO

Related News