సిద్ధూ సెల్ఫ్ గోల్.. స్వామి కామెంట్!

కర్ణాటక కాంగ్రెస్ ట్రంప్ కార్డ్ సిద్ధరామయ్య.. తన గొయ్యి తనే తవ్వుకున్నాడా? కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్ధూయే రూటేశారా? ఈ వాదనే కన్నడ నాట గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు ‘కలరింగ్’ ఇచ్చిన సిద్ధూ.. రాహుల్, సోనియాలతో ప్రమేయం లేకుండా తానే పార్టీని నిలబెడతానని హైకమాండ్ దగ్గర చెప్పుకున్నారు. కేవలం తన పాపులారిటీతోనే బీజేపీని మట్టికరిపిస్తానంటూ తొడగొట్టి మరీ సవాల్ విసిరారాయన. ప్రాంతీయతను రెచ్చగొట్టడం లాంటి సెంటిమెంట్‌ని బలంగా వాడుకున్న సిద్ధూ.. బీజేపీ విజయావకాశాల్ని ఎక్కడికక్కడ దెబ్బ తీస్తూ వచ్చినట్లు కనిపించారు. కానీ.. ఆఖరాట మాత్రం అడ్డం తిరిగింది.  ఇంతకీ సిద్ధరామయ్య బొమ్మ తిరగబడ్డానికి కారణం ఏమిటి? లింగాయత్‌లను దగ్గర చేర్చుకుని, వాళ్ళడిగిన ‘ప్రత్యేక మత’ హోదా కల్పించడం దగ్గరే సిద్ధరామయ్యకు ‘సినిమా’ స్టార్ట్ అయ్యిందంటున్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. అప్పట్లోనే తాను మీడియా ఎదుట ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశానని, లింగాయత్‌ల ఓట్లు చీల్చడమనే సిద్ధూ సాహసం ఖచ్చితంగా ఆత్మహత్యా సదృశమేనని స్వామి అంటున్నారు.

READ ALSO

Related News