రాజాసింగ్ రాజీనామా

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు అందజేశారు. గోరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంకోసమే రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన… తన ఉద్యమానికి, పార్టీకి ముడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన వల్ల పార్టీకి నష్టం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే తన రాజీనామా లేఖను సమర్పించానని రాజాసింగ్ అన్నారు. తెలంగాణాలో యధేచ్చగా గోవులను కబేళాలకు తరలిస్తున్నారని, గోవధను ఈ ప్రభుత్వం అరికట్టలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికైనా గోవధను తెలంగాణా సర్కార్ అరికట్టాలని ఆయన కోరారు.

READ ALSO

Related News