హీరో శివాజీపై గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర దాడి

బీజేపీ టార్గెట్‌గా తరచూ తీవ్ర విమర్శలు చేసే హీరో శివాజీకి కమలం సెగ తగలడం మొదలైంది. గన్నవరం ఎయిర్‌పోర్టులో శివాజీ మీద దాడి యత్నం జరిగింది. పోలీసుల జోక్యంతో ఆయనకు ముప్పుతప్పినట్లైంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు.

ఆయనకు స్వాగతం పలకడానికి వందల మంది పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన శివాజీ, బీజేపీ కార్యకర్తలకు తారసపడ్డాడు. దీంతో ఆవేశం తెచ్చుకున్న కమల దండు శివాజీ కారు మీదకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆయనపై చేయి చేసుకునే దాకా పరిస్థితి వెళ్లడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో శివాజీ ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు తాను వెరవబోనని, చెప్పాలనుకున్నది సూటిగా చెబుతానని, కేంద్రంపై తన పోరాటం ఆగదని పేర్కొన్నాడు.

Related News