‘భరత్ అనే నేను’ షూట్.. అతడి వల్ల ఇబ్బందులుపడ్డాను

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పుడిప్పుడే ఒకొక్కరుగా నోరు విప్పేందుకు బయటకు వస్తున్నారు. ఆ జాబితాలోకి మరో జూనియర్ ఆర్టిస్ట్ సునీత చేరిపోయింది. ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్లు కూడా తనను టార్చర్ పెట్టారని గుర్తుచేసింది. ఐతే, తాను ముఖం మీదనే తిప్పికొట్టేదానినని, తన వాయిస్ వల్ల తానే సినిమాల్లో ఛాన్స్‌లు పోగొట్టుకున్నానని, తన సమస్యలను అర్థం చేసుకున్నవాళ్లు మాత్రమే అవకాశాలు ఇచ్చారని ఆమె తెలిపింది.

‘టీవీ9’ చేపట్టిన చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఈమె, అసోసియేట్ డైరెక్టర్లు మాత్రమే తమను వేధిస్తారని, మిగతా వాళ్ల విషయం తెలీదని చెప్పింది. ఒకానొక దశలో తనను ముంబైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారని తెలియజేసింది. ఈక్రమంలో భరత్ అనేనేను మూవీలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మీద సీరియస్ ఎలిగేషన్స్ చేసింది.

Related News