దీదీ చెబితే విన్లేదు, అందుకే..

కలిసికట్టుగా పోరాడితే ఎంతటి శత్రువునైనా మట్టికరిపించవచ్చన్నది ఐకమత్య సూత్రం. రాజకీయాల్లో అయితే ఈ ఫార్ములాకుండే బలమే వేరు! బీహార్లో బీజేపీని మట్టి కరిపించడానికి.. నితీష్-లాలూ లాంటి ఆగర్భ శత్రువులే ఒక్కటిగా నిలబడి ‘మహా సంఘటన్’ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. బీజెపీని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిలువరించగలిగారు. నిన్నమొన్నటి యూపీ ఉపఎన్నికల్లో సైతం.. బీఎస్పి-ఎస్పీలు ఒక్కటై యోగీ ఆదిత్యనాధ్ ఇమేజ్‌కి డామేజ్ కలిగించారు. బలమైన శత్రుపక్షంగా మారిన బీజేపీకి బుద్ధి చెప్పాలంటే.. మిగతా పార్టీలన్నీ జట్టు కట్టడమొక్కటే మార్గాంతరం. ”ఈ విషయాన్నే కర్ణాటక ఎన్నికల ముందు నేను చెప్పాను.. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి పోటీ చేసిన పక్షంలో బీజేపీ జీరోసైజ్‌కి పడిపొయ్యుండేది” అంటూ వాపోతోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమి అల్లికలో బిజీగా వున్న మమత.. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం విపరీతంగా చెమటోడుస్తోంది. ఆమె చెప్పిన సూత్రం అమల్లో పెట్టి ఉంటే.. కర్ణాటక బీజేపీ ‘చావుదెబ్బ’ తినిఉండేదన్నది క్లియర్. కాంగ్రెస్ ఖాతాలోని 38 శాతం ఓట్లు, జేడీఎస్ సాధించిన 18 శాతం ఓట్లు కలిస్తే.. బీజేపీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. ఏదైతేనేం.. మోదీ బ్యాచ్‌ని నైతికంగా కుంగదీయడమనే ‘గోల్డెన్ ఛాన్స్’ మిస్సయిందంటూ ఉస్సూరుమంటోంది మమతా బెనర్జీ.

READ ALSO

Related News