కులాలు, జాతులకే ప్రాధాన్యమా? సిద్దా కన్నీరు

కర్ణాటక తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టించి పనిచేసినా ప్రజలు పట్టించుకోలేదని వాపోయారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేసినా ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

బుదవారం గెలిచిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడిన సిద్దరామయ్య.. బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో తన బాధనంతా వెళ్లగక్కారు. ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం తమను ఓడించారన్నారు. మా ప్రణాళికను ప్రజలే మార్చేశారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్‌, జేడీఎస్ ఎమ్మెల్యే లెవరూ బీజేపీ వలలో పడవద్దని ఆయన సూచించారు.

READ ALSO

Related News