India / Entertainment
వెబ్ సిరీస్‌పై కన్నేసిన బాహుబలి

పదికోట్ల బడ్జెట్ బాహుబలి వెబ్‌ సిరీస్ రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ బాక్సాఫీసు రికార్డులను తిరగ రాయడంతో మేకర్స్ వెబ్ సిరీస్‌ రూపొందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. మొత్తం 15 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్.. బాహుబలి మాదిరిగానే అందర్నీ ఆకట్టుకుంటుందని వాళ్ల ప్లాన్. ముఖ్యంగా రమ్యకృష్ణ శివగామి పాత్రను ఇందులో హైలైట్ చేయనున్నట్లు సమాచారం.

 

ఇదిలావుండగా కొద్దిరోజుల్లోనే బాహుబలి టీవీ సిరీస్ రానుందని ఓ సందర్భంలో చెప్పాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్. దీనికి సంబంధించి బాహుబలి మేకర్స్‌తో ఓ మల్టీనేషనల్ కంపెనీ చర్చలు జరుపుతోంది. ఐతే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టకుండా, పర్యవేక్షణకే పరిమితంకానున్నాడు రాజమౌళి. కాకపోతే జక్కన్న పేరుని మాత్రం ఆ కంపెనీ నియోగించుకోనుంది. సీజన్ వారీగా బాహుబలి సిరీస్‌ని తీసుకురావాలన్నది ఎంఎన్‌సీ థాట్. ఈ నేపథ్యంలో బాహుబలి పేరుని వినియోగించుకున్నందుకు రాయల్టీ రూపంలో మేకర్స్‌కి 25 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మిగతాచర్చలు ఓ కొలిక్కి వస్తే త్వరలో భారతీయ బుల్లితెర ప్రేక్షకులను బాహుబలి అలరించడం ఖాయం.

 

Read Also

 
Related News