పీఎన్‌బీ కుంభకోణంలో జైట్లీ కూతురు!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈసారి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేశారు. పంజాబ్ నేషనల్‌బ్యాంక్
కుంభకోణంలో ఆర్థికమంత్రి కూతురు వుందంటూ ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చారు. పీఎన్‌బీ కుంభకోణంలో కూతుర్ని కాపాడేందుకే జైట్లీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

కుంభకోణం బయటపడటానికి నెల రోజుల ముందే జైట్లీ కుమార్తె నిర్వహిస్తున్న న్యాయసంస్థకు నిందితులు భారీగా చెల్లింపులు చేశారని, నిందితులతో సంబంధాలున్న ఇతర న్యాయసంస్థలపై కూడా సీబీఐ దాడులు జరపాలని, కానీ, సీబీఐ ఎందుకు దాడులు జరగలేదని రాహుల్ ప్రశ్నించారు.

 

Related News