హైకోర్టు నోటీసులు.. చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు?

ఏపీ సీఎం చంద్రబాబుకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తావిచ్చిన చంద్రబాబు ఎత్తుగడకు ఇదొక యాంటీ క్లయిమాక్స్ లాంటిది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. గత రెండున్నరేళ్ల నుంచి సాగిన ఈ ‘వ్యవహారం’ వివాదాస్పదంగా మారింది. ఫిరాయింపు చట్టాల్ని తుంగలో తొక్కి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయితే.. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూలింగ్ పార్టీ పంచన చేరినట్లు వారంతా సమర్థించుకున్నారు. ఫిరాయించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో నలుగురు మంత్రి పదవులు కూడా పొందారు.

అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజీనామా చేసి, వాటిని ఆమోదించుకున్న తర్వాత మాత్రమే పార్టీ మారితే అది చట్టబద్ధమంటూ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఈ పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు.. సదరు 22 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేసింది. వీరంతా నిర్ణీత గడువులోగా కోర్టుకు సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్లంతా ‘కింకర్తవ్యం’ కోసం సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది.

READ ALSO

Related News