చిన్న సినిమాలకు చంద్రబాబు బిస్కెట్లు

చిన్న బడ్జెట్‌‌తో సినిమాలు తెరకెక్కించే ప్రొడ్యూసర్స్‌కు గుడ్ న్యూస్. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి వాటికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే చిత్రాలకు ప్రస్తుతమున్న జీఎస్టీ 18శాతంలో రాష్ట్ర జీఎస్టీ 9 శాతం తొలగిస్తామని తెలిపింది. ఆయా చిత్రాలకు పోస్ట్‌‌ప్రొడక్షన్‌ ఏపీలోనే చేయాలనే నిబంధన విధించింది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలపై తీసిన 10 చిన్న సినిమాలకు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది.

అటు ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామని తెలియజేశారు ఏపీ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ. చిన్న సినిమా వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

Related News