వైసీపీలో మాజీ సీఎం కొడుకు

ప్రతిపక్ష వైసీపీ మరో రకం ‘ఆపరేషన్ ఆకర్ష్’కి తెర తీసింది. మెయిన్ స్ట్రీమ్‌లో లేని, అజ్ఞాతంలో గడుపుతూ వస్తున్న నేతలందరినీ చేర్చుకుంటూ.. పార్టీకి కొత్త రక్తం ఆపాదించే పనిలో పడింది. తాజాగా.. మరో మాజీ సీఎం కొడుకు వైసీపీ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమయ్యారు. జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడ్డం కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటూ గట్టిగా చెబుతున్నారు.

1990-92 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా చేసిన నెల్లూరు జిల్లా కీలక నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి. ఆయన భార్య రాజ్యలక్ష్మి కూడా ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ప్రస్తుతం వీళ్ళ కొడుకు రామ్‌కుమార్ రెడ్డి లైన్లోకొచ్చేశారు. కొన్నాళ్లుగా ఆయన కూడా బీజేపీలో చేరి రాజకీయాలు చేస్తున్నప్పటికీ సరైన ప్రాధాన్యం దొరక్క ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు వైసీపీలో చేరి జగన్ సహకారంతో ఎదుగుదలను ఆశిస్తున్నారాయన. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటున్న రామ్‌కుమార్ రెడ్డి.. జగన్ సీఎం అయితేనే ఏపీకి మంచిరోజులొస్తాయని జోస్యం చెప్పారు. మంచి ముహూర్తం చూసి వైసీపీ కండువా కప్పుకుంటానని కూడా వెల్లడించారు.

READ ALSO

Related News