ఏడాదిన్నర తరువాత ఇలా..

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం ఢిల్లీలోప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నర తరువాత వీరిద్దరూ సమావేశం కావడం విశేషం.

పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లతో సమర్పించిన పూర్తి స్థాయి అంచనాల ఆమోదం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్ లో తగినన్ని నిధుల కేటాయింపు, రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225 కి పెంచడంతో బాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటి అంశాలపై చంద్రబాబు మోడీతో చర్చించారని తెలుస్తోంది.

అలాగే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాలను ఖరారు చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కూడా ఆయన కోరినట్టు తెలుస్తోంది.

 

Related News