మక్కెలిరగ్గొడతా: చంద్రబాబు

కర్నాటకలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అడుగడుగునా చట్టవ్యతిరేకంగా చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు వెళ్లడానికి విమానాలకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. మెజార్టీ లేకున్నా అప్రజాస్వామిక విధానాలతో అధికారం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. గతంలో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా బీజేపీ ఇదేవిధంగా ప్రవర్తించిందన్నారు. ఏపీపై కేంద్రం కన్నుపడుతోందన్న ఆయన, శాంతిభద్రతల విషయంలో కుట్రలు చేయాలని చూస్తే మక్కెలిరగ్గొడతానని చంద్రబాబు హెచ్చరించారు.

READ ALSO

Related News