ప్రదీప్ కేసు.. మరో 24 గంటల సస్పెన్స్

డ్రంకెన్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడిన టీవీ యాంకర్ ప్రదీప్ బుధవారం కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. సోమవారం తన తండ్రితో బాటు గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరైన ప్రదీప్ మంగళవారం కోర్టుకు వెళ్ళాల్సి ఉంది.

అయితే రేపటి వరకు గడువు కోరడంతో పోలీసులు అంగీకరించారు. ఆయనకు నాంపల్లి కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే కోర్టు జైలుశిక్ష విధిస్తుందా లేక జరిమానాతో సరిపెడుతుందా అన్న విషయం తేలాల్సి ఉంది.

 

Related News