పెత్తనం ఇక్కడ కాదు, అక్కడ

రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఓటు వేశామన్నారు మంత్రి నారా లోకేష్. బీజేపీతో లాలూచీ పడిన ఓ పార్టీ, ఓటు వేయకుండానే పారిపోయిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలబడడాన్ని ఆంధ్రుడైన జీవీఎల్ నరసింహారావు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. పంచాయితీ‌రాజ్ వ్యవస్థ నడిచేది పీడీ ఎకౌంట్స్‌పైనే, అది స్కామ్ అంటే ఎవరైనా నవ్వుతారని అన్నారు. ఈ విషయంలో కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఎన్డీఏలో తాము వుంటే అభివృద్ధి, బయటకొస్తే అవినీతి పరులా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు మంత్రి లోకేష్. జీవీఎల్ ఆంధ్రా ఎంపీ కాదని, ఎక్కడో నుంచో వచ్చి మన మీద పెత్తనం చేయాలనుకుంటే ఊరుకుంటా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు, జీవీఎల్ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. అంతకుముందు మాట్లాడిన ఎంపీ జీవీఎల్, సీఎం చంద్రబాబు కొడుకు రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని భ్రష్టుపట్టారని, కాంగ్రెస్ పార్టీకి స్టెప్నీగా తయారు చేశారని విమర్శించారు.

READ ALSO

Related News