అనసూయ కౌంటర్ ఎటాక్, ఎందుకు?

రంగస్థలం మూవీతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది నటి అనసూయ. అందులో పల్లెటూరి మహిళగా రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది. ఇదిలావుండగా ఓవైపు యాంకర్‌‌గా బుల్లితెరపై కనిపిస్తూ.. మరోవైపు ఐటమ్‌‌సాంగ్స్‌ చెయ్యడం.. ఇద్దరు పిల్లల తల్లివి నీకు అవసరమా? అంటూ సోషల్‌మీడియాలో వస్తున్న విమర్శలపై అనసూయ కాసింత ఘాటుగానే స్పందించింది.

ఇద్దరు పిల్లలకు తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకోలేదా? ఒకప్పటి అగ్ర తారలైన భానుమతి, సావిత్రి వంటి నటీమణులు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించిన విషయాన్ని గుర్తుచేసింది. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? మంచి క్యారెక్టర్లు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

 

Related News