AP / general news
గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకోనున్న జనసేనాని

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకోనున్నారు. ఇండియా, యూరోపియన్ బిజినెస్ ఫోరం గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయనుంది. ఈ నెల 17 న లండన్ లో జరగనున్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ అవార్డును అందుకోనున్నట్టు జనసేన మీడియా హెడ్ పి.హరి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డ్ ఇస్తున్నట్టు ఈ ఫోరం గతంలో ప్రకటించింది.

 

Read Also

 
Related News