ఈ వీడియో అందర్నీ చూడమని కోరాలి: ఆనంద్ మహీంద్ర

భారతదేశ ప్రముఖ వ్యాపార వేత్త.. మహీంద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇక మీదట ఈ వీడియో స్కూల్ కు వెళ్లే ప్రతీ స్టూడెంట్, ప్రతీ పార్లమెంట్ మెంబరునూ తప్పనిసరిగా చూడమని కోరాలని సూచించారు. భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు ఇది తప్పనిసరన్నారు. ఇంతకీ ఆయన పోస్ట్ చేసిన సదరు వీడియోలో ఉన్నదేంటంటే.. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అవిశ్వాసతీర్మానం సమయంలో లోక్‌సభలో ప్రసంగిస్తున్న సన్నివేశం. రాజకీయపార్టీల విధానాలు, దేశ సమగ్రత, సౌబ్రాతృత్వ ఆవశ్యకతను వివరిస్తూ వాజ్ పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగ పాఠం ఇది. హిందీ మాట్లాడని వారికి సైతం అర్థమయ్యేలా ఈ వీడియోకి సబ్ టైటిల్స్ వేసి మరీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆనంద్ మహీంద్ర ఆకాంక్షించారు. ఆయన చేసిన విన్నపాన్ని కేటీఆర్ వంటి అనేక మంది ప్రముఖులు సమర్థిస్తూ దీనిని లైక్ చేస్తూ, రీట్వీట్ చేస్తున్నారు. ఇదే ఆ వీడియో ట్వీట్..

Related News