రాహుల్‌పై షా సెటైర్.. తీరిక దొరికితే..

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడంతో బీజేపీ టాప్ లీడర్స్ ఫుల్‌జోష్‌లో వున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. రాజకీయ పార్టీలను ఒకే తాటి మీదకు తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్న రాహుల్‌పై చురకలు వేశారు. రాహుల్ జీ.. కన్ను కొట్టడం, పార్లమెంట్ కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడం వంటి పనుల నుంచి తీరిక దొరికితే కొంచెం ఇటు కూడా చూడాలంటూ రాసుకొచ్చాడు షా.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు సవరణ తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదంతా చూడకుండా మీరు అక్కడ ఆందోళన ఎందుకు చేస్తున్నారని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు షా. అవిశ్వాస తీర్మానం సమయంలో రాహుల్ తన స్పీచ్ తర్వాత ప్రధాని మోదీని కౌగిలించుకున్న సంగతి తెలిసిందే! అనంతరం తోటి కాంగ్రెస్ నేత వైపు చూస్తూ కన్ను గీటారు రాహుల్‌గాంధీ. ఇటు ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేంద్రం వైఖరికి నిరసనగా దళిత, గిరిజన సంఘాలు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలో సీపీఎం నేత సీతారాం ఏచూరితో కలసి రాహుల్ పాల్గొన్న ఫోటోలను ఈ ట్వీట్‌కు జత చేశారు అమిత్ షా.

READ ALSO

Related News