భారతిని కోర్టుకు లాగే ప్రయత్నం .. వైసీపీ ఫైర్

ఈడీ కేసులో వై.ఎస్.భారతి నిందితురాలని వచ్చిన వార్తల నేపథ్యంలో.. వైసీపీ నేత అంబటి రాంబాబు..టీడీపీ నాయకులపై ఫైరయ్యారు. ఏపీ సీఎం. చంద్రబాబు ఆదేశాలతోనే భారతిపై కేసు పెట్టించారని ఆయన ఆరోపించారు. బీజేపీతో జగన్ కుమ్మక్కయితే ఈడీ ఎందుకు కేసు పెట్టిందని ప్రశ్నించారు… భారతిని కోర్టుకు లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ పై కేసులు పెట్టి జైల్లో పెడితే గెలవవచ్చునన్న తాపత్రయం చంద్రబాబుదని, గత ఎన్నికల సమయంలో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడేమో 43 వేల కోట్లని అంటున్నారని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు 43 వేల కోట్లయితే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రూ. 1200 కోట్లకు సంబంధించి మాత్రమే కేసు నడుస్తోందని అన్నారు.

‘ ఆనాడు జగన్ జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో వీళ్ళు ఇలా కుట్రలు పన్నుతున్నారు ‘ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మా పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవి సంపాదించిన ఆదినారాయణ రెడ్డి మమ్మల్ని విమర్శిస్తారా ? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోలేదా ? అని అన్నారు. బాబులా వ్యవస్థలను తాము మేనేజ్ చేయలేమన్నారు. మీ హెరిటేజ్ గ్రూపు లావాదేవీలపై మేం ప్రశ్నిస్తున్నామా  అని..  వ్యాఖ్యానించారు.

READ ALSO

Related News