AP and TS / Entertainment
అఖిల్..హలో పోస్టర్లో అదే స్పీడ్ !
హలో అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అక్కినేని అఖిల్. ." మనం " ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో ఈ యువ హీరో నటిస్తున్న " హలో " సినిమా పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 16 న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఈ పోస్టర్లో ప్రకటించింది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ డైరెక్టర్. డిసెంబరు 22 న ఈ చిత్రం విడుదల కానుంది. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అఖిల్ మళ్ళీ నటిస్తున్న చిత్రమిది.
 

Read Also

 
Related News