కోటి కొట్టేసిన హీరోయిన్

‘ఆడి పొనా ఆవని’ అనే తమిళ సినిమా లో హీరోయిన్ గా చేసిన శృతి సోషల్ మీడియా వేదికగా చేసుకుని మోసాలకు దిగింది. ప్రేమ పేరుతో యువకుల్ని మోసగించి దాదాపు కోటి రూపాయల వరకూ పోగేసింది. జర్మనీలో ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఎన్నారైని అయితే నిండాముంచింది. సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో శృతి మోసాల పరంపర బయటకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే, సేలంకు చెందిన జి.బాలమరుగన్ జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇంకా పెళ్లికాని అతను, 2017 మేలో తన ప్రొఫైల్ ను మ్యారేజ్ బ్యూరో వెబ్ సైట్ లో ఉంచాడు. ఇదే వెబ్ సైట్ ద్వారా శ్రుతి అత‌డికి పరిచయమైంది.

తన పేరును మైథిలీ వెంకటేశ్ గా పరిచయం చేసుకుని కొన్ని ఫ్యామిలీ పిక్స్ అంటూ పంపించింది. అలా వీరి పరిచయం బలపడ్డాక ఆరోగ్యం బాగాలేదని, తన తల్లికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని.. ఆపరేషన్ కోసం డబ్బులు కావాలని అడిగింది. ఇలా బాలమురుగన్ నుంచి మొత్తం రూ. 41 లక్షల వరకు దండుకుంది. చివరికి ఆమె మోసం చేస్తుందని గ్రహించిన అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కూపీలాగిన పోలీసులకు శృతి ఇలాంటి చీటింగ్స్ మరికొంతమందిని చేసిందని కోటివరకూ కూడబెట్టిందని తెలిసొచ్చింది. అయితే, సినిమాల్లో అవకాశాలు రాకే తానీ పని చేయాల్సి వచ్చిందని పోలీసులతో చెబుతోంది.

Related News